నువ్వు లేవు
దగ్గర, కానీ నీ జ్ఞాపకాలు ,
సవ్వడి లేని
మదిలో రాశుల కొద్దీ
నా ముఖాన నీ
కొంగును సుతారంగా కప్పిన క్షణం
గుసగుసలాడుతుంటే
వచ్చిన పరిమళాలు గుర్తున్నాయా?
నీ కురులను
ముద్దాడి మైమరచిన వైనం
నా పెదాల్లో
చిక్కుకున్న నీ సన్నజాజి మాల
నీ సన్నని దేహాన్ని
నా కౌగిట్లో బంధించి
ప్రపంచాన్ని
కాజేసిన ఆనందం పొందినపుడు
నా మదిలో
ఒదిగిపోయిన నీ మౌనం నా గేయమై
నా ఊపిరిలో లీనమై
నీతో పంచుకున్నప్పుడు
కన్నీరే కార్చినా
కరగనంత నీ ప్రేమ
కళ్ళలో దీపమై
నాకు దారి చూపినపుడు
చిందిన అందాలన్నీ
నా తప్పుని సరిదిద్ది
మనసులు ఊరట చెంది
కలిసి నవ్విన క్షణం
ఇవన్నీ ఏ
జన్మలోనివో , ఇప్పుడిలా కవ్వించి
నవ్వు దాచలేనన్ని
కన్నీళ్ళని కలిగించినా
నువ్వు రావు,
వస్తావని ఎదురుచూస్తూ ఉన్నా
మళ్ళీ బ్రదుకుదామన్న ఆశ చావక