Pages

16/04/2012

GEETANJALI #9


O Fool, to try to carry thyself upon thy own shoulders!
O beggar, to come beg at thy own door!

Leave all thy burdens on his hands who can bear all, and never look behind in regret.

Thy desire at once puts out the light from the lamp it touches with its breath.
It is unholy---take not thy gifts through its unclean hands.
Accept only what is offered by sacred love.అయ్యో మందబుద్ధీ! జడుడా!
నీ ఇంటి లోగిలిలోకే ముష్టి కోసం వెడతావా?
నీ బాధ్యతలన్నీ నీ మూపునే మోస్కోగ లవా?

అన్నీ నిర్వహించి భరించగల అంతర్యామి చేతిలో,  నీ బరువులన్నీవిడిచిపెట్టి ఉండు.

నీ కాంక్షల ఊపిరులు మసిలా ముసిరి, జ్ఞానదీపాన్ని కప్పేస్తాయి.
ఆశతో మలినమైన నీ చేతులతో దేన్నీ గ్రహించకు. అది పాపం.

స్వచ్చమైన ప్రేమతో, నిండైన దయతో భగవానుడిచ్చిన ప్రసాదమే స్వీకరించు.

12/04/2012


GEETANJALI #8

The child who is decked with prince's robes and who has jewelled chains round his neck loses all pleasure in his play; his dress hampers him at every step.

In fear that it may be frayed, or stained with dust he keeps himself from the world, and is afraid even to move.

Mother, it is no gain, thy bondage of finery, if it keep one shut off from the healthful dust of the earth, if it rob one of the right of entrance to the great fair of common human life.రాజాంబరాలు, ముత్యాల హారాలు చుట్టేసిన పసిపిల్లవాడు ఆటల్లో వినోదించగలడా?
ఆభరణాలు అడుగడుగునా అతనికడ్డు తగుల్తునే ఉంటాయి.

బట్ట  మాసిపోతుందేమోనని , చిరిగి చివికిపోతుందేమోనని
ఆటలాడుకోక, ప్రపంచంలో ఇమడలేక, ఒంటరిగా ఉండిపోతాడు.

మట్టివాసన నిండుగా పీల్చనివ్వని,
నలుగురితో కలిసి తిరిగి హాయిగా నవ్వనివ్వని,
ఈ వృధా సంపదలు బంగారు సంకెలలు తల్లీ.

11/04/2012

GEETANJALI #7My song has put off her adornments.She has no pride of dress and decoration.
Ornaments would mar our union; they would come between thee and me; their jingling would drown thy whispers.

My poet's vanity dies in shame before thy sight. O master poet, I have sat down at thy feet. Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.నా భావన, అన్ని అలంకారాలనీ విడిచిపెట్టింది.
పటాటోపమూ, పొగరూ ఇక నా కవితకు లేవు.
ఈ అలంకారాలూ, అహంకారాలూ, నీకూ నాకూ అడ్డుగోడ.
మన సంగమాన్నవి నీరసపరచుతాయి.

ఈ ఆభరణాల నిక్వాణంలో నీ గుసగుసలు నా చెవికి సోకవు.
నా కవిత్వాహంకారమంతా నీ సత్యస్ఫూర్తి ముందు లజ్జతో తలవాల్చింది.

ఆదికవీశ్వరా! నీ చరణసన్నిధి లో చేరి,
నీ అద్భుత నాదామృతాన్నినింపననువైన వేణువుగా,
నా జీవితాన్ని నేను సరిచేస్కునే అవకాశమివ్వు తండ్రీ... 
GEETANJALI #6

Pluck this little flower and take it, delay not! I fear lest it droop and drop into the dust.

I may not find a place in thy garland, but honour it with a touch of pain from thy hand and pluck it. I fear lest the day end before I am aware, and the time of offering go by.

Though its colour be not deep and its smell be faint, use this flower in thy service and pluck it while there is time.ఈ చిన్ని పూవుని కోసి తీస్కో తండ్రీ, జాగు చేయకు!
వాడిపోతుందో, లేక మట్టిలో కలిసిపోతుందోని నా భయం.

నీ వనమాల లో దీనికి చోటులేకపోవచ్చు,
కానీ నీ సున్నితమైన మునివేళ్ళకి కొంత శ్రమనిచ్చి, పాణిగ్రహణం చేయి.

నేను తెలుసుకునేలోపునే, పొద్దు వాలి, నీ పూజ వేళ ముగిసిపోవునో,

రంగులో, సువాసనలో గాంభీర్యం లేకపోయినా,
కాలం కబళించే లోపునే, దీన్ని కోసుకో స్వామీ.
GEETANJALI #5


I ask for a moment's indulgence to sit by thy side. The works that I have in hand I will finish afterwards.


Away from the sight of thy face my heart knows no rest nor respite, and my work becomes an endless toil in a shoreless sea of toil.

Today the summer has come at my window with its sighs and murmurs; and the bees are plying their minstrelsy at the court of the flowering grove.

Now it is time to sit quite, face to face with thee, and to sing dedication of live in this silent and overflowing leisure.


ఒక్క క్షణకాలం నీ దృష్టి నా పైనే నిలుపు
నా పై ప్రీతి తో నీ చెంత చేరనీ 

ఈ లౌకిక కర్మకాండమెప్పుడైనా నేరవేర్చవచ్చు 

నీ ముఖ కమలము గోచరించకపోతే 
నా మనసు మనసులో ఉండదు
నా చేతలన్నీఅనంతసంసారసాగరం లో అలల్లా
అంటూ లేకుండా అయిపోతాయి

నిట్టూర్పులతో, ఊసులాటలతో, విచ్చిన తోటల్లో విహరించే తేటులతో వేసవి నా ముంగిట నేడు వాలింది

ఇదే సమయం, మౌనంగా నీ సన్నిధి నిలబడి,
నీ సమక్షంలో నీ ఎదుట,
ఈ శాంతమైన ఏకాంతంలో,
నా ప్రాణార్పణ గీతాన్ని ఆలపించేందుకు..... 
GEETANJALI #4Life of my life, I shall ever try to keep my body pure, knowing that thy living touch is upon all my limbs.

I shall ever try to keep all untruths out from my thoughts, knowing that thou art that truth which has kindled the light of reason in my mind.

I shall ever try to drive all evils away from my heart and keep my love in flower, knowing that thou hast thy seat in the inmost shrine of my heart.

And it shall be my endeavour to reveal thee in my actions, knowing it is thy power gives me strength to act.

ఆసాంతమూ, నా దేహాన్ని శుద్ధి చేస్కోడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను, నా అణువణువు లోనూ నీ చైతన్య స్పర్శే ద్యోతకమౌతోందని గుర్తిస్తూ,

నిత్యమూ నా ఆలోచనలను పవిత్రం చేసుకుంటూ, అసత్యాలను నిర్మూలిస్తూ ఉంటాను, నీ సత్యస్ఫురణే నా లో జ్ఞానప్రకాశానికి కారణమని తెలుసుకుంటూ,

నా మది లోని అంతఃశత్రువులను పారద్రోలుతూ నిర్మలంగా, ప్రేమ కుసుమాలని పెంచ యత్నిస్తాను, నా దహర పీఠిక లో ప్రతిష్ఠితుడవు నీవేనని గ్రహిస్తూ,

ఈ త్రికరణశుచిని నా ప్రతి చేష్టలోనూ వ్యక్తపరచ కృషిచేస్తూ ఉంటాను, నా చేతనకు మూలశక్తి నీవని అనుకుంటూ, అనుభవిస్తూ,

GEETANJALI #3I know not how thou singest, my master! I ever listen in silent amazement.

The light of thy music illumines the world. The life breath of thy music runs from sky to sky. The holy stream of thy music breaks through all stony obstacles and rushes on.

My heart longs to join in thy song, but vainly struggles for a voice. 
I would speak, but speech breaks not into song, and I cry out baffled.

Ah, thou hast made my heart captive in the endless meshes of thy music, my master!ప్రభూ, నీ గాన కళా కౌశలం నాకు ఎరుకపడుతుందా ? సంభ్రమం తో వినయంగా నేనెప్పుడూ నీ గానాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాను.

నీ నాదజ్యోతులే ఈ విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నాయి.
నీ నాదమే ప్రాణమై శూన్యాలలోనూ నిండిపోయింది.
నీ నాదం వెల్లువై బండబారిపోయిన జాడ్యాలను భేదిస్తూ, సాగిపోతోంది.

శ్రుతి కలపాలని నా మదీ ఉవ్విళ్ళూరుతోంది, కానీ అభివ్యక్తి రాక సతమతమౌతోంది.
మాటాడగలనే కాని, మాట పాట కాక, కాలేక, ఆర్తి గా అరుస్తున్నాను.

ఏమి చిత్రం స్వామీ? నీ అమృతానంత నాదం లో నా మది బందీ అయిపొయింది.


07/04/2012

GEETANJALI #2

When thou commandest me to sing it seems that my heart would break with pride; and I look to thy face, and tears come to my eyes.

All that is harsh and dissonant in my life melts into one sweet harmony---and my adoration spreads wings like a glad bird on its flight across the sea.

I know thou takest pleasure in my singing. I know that only as a singer I come before thy presence.

I touch by the edge of the far-spreading wing of my song thy feet which I could never aspire to reach.

Drunk with the joy of singing I forget myself and call thee friend who art my lord.నన్ను ఆలపించమని నీ ఆజ్ఞ విన్నంతనే సంతోషముప్పొంగి నా చిన్ని గుండె బద్దలైపోతుందేమోననిపించింది. నీ మోము చూస్తుండగా, అలా నా కళ్ళు చెమర్చాయి.

నా జీవితం లోని కాఠిన్యమూ, కపటమూ అంతా ఒక తీయని ప్రశాంతత లోకి కరిగిపోయి, నా ప్రతిస్పందన రాజహంస లా రెక్కలు విప్పింది.

నా గానాన్ని ఆస్వాదిస్తావని తెలిసింది ప్రభూ, గాయకుని ఉపాధి లోనే కదా నేను నీ కడకు రాగలిగేది.

దిశాంతాలకు  విప్పారిన నా పాటల వెల్లువల అంచులతో నేనెప్పటికీ తాకనూహించలేని నీ పాదాలను అందుకోగలను.

కానీ పరవశమైన ఆ ఉన్మత్త స్థితిలో నా స్వామిని నిన్ను నా స్నేహమనుకొని పలవరిస్తున్నాను.   
GEETANJALI #1

Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.

This little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new.

At the immortal touch of thy hands my little heart loses its limits in joy and gives birth to utterance ineffable.

Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill.

దేవా!

నీవు నన్ను నిత్యుని గా సృష్టించావు. అదే నీ కరుణ, అదీ నీకానందం. ఈ  బడుగు మనసు లో వెతలు తోడి, నిండైన జీవితాలని నింపుతూనే ఉన్నావు.

ఈ చిన్ని వెదురుని వేణువుని చేసి, పర్వత శిఖరాల పై, లోయల లోతులలో తిప్పుతూ, నిత్య నూతనమైన సంగీతాలకు ఊపిరులూదుతూనే ఉన్నావు.

నీ అమృత హస్త స్పర్స తో నా మది వివశమై , పరవశమై, మోదసీమల్లో పరిమితులు కోల్పోయి, అవ్యక్తానందాలను ఊసులాడుతోంది.

నీ అనంతమైన ప్రసాదములు, ఈ చిన్ని అంజలి తోనే నేను గ్రహించగలిగేది. యుగాలు దొర్లిపోతున్నాయి, సంతత ధారగా నీ దయ ప్రవహిస్తూనే ఉంది. అయినా ఇంకా తనివి తీరక చోటు మిగిలే ఉంది.